ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు వేదికైంది. హాలీవుడ్ మాత్రమే కాక దేశ విదేశాల సినీ పరిశ్రమల నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప నటులు, నటీమణులు, టెక్నీషియన్స్ ఆస్కార్ వేడుకలకు హాజరయ్యారు.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ బృంద సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ అవార్డులకు ఆర్‌ఆర్‌ఆర్ తో పాటు భారతీయ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అకాడమీ అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా గునీత్ మోంగా, కార్తికి గోన్సాల్వేస్ అవార్డును అందుకున్నారు.
ఈ చిత్రం హాలౌట్, హౌ డు యు మెజర్ ఏ ఇయర్?, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్ మరియు స్ట్రేంజర్ ఎట్ ది గేట్‌లకు వ్యతిరేకంగా పోటీ పడింది. దర్శకురాలు కార్తికి ఈ అవార్డును ‘నా మాతృభూమి, భారతదేశం’కి అంకితం అంటూ పేర్కొన్నారు. గునీత్ మోంగా కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ విధంగా రాసుకొచ్చారు. ఈ రాత్రి చారిత్రాత్మకమైనది, ఇది భారతీయ సినీ పరిశ్రమకి ఇది మొట్టమొదటి ఆస్కార్” అంటూ తన ఇన్ స్టా లో పేర్కొన్నారు.
ఈ చిత్రాన్ని అచిన్ జైన్, గునీత్ మోంగా నిర్మించగా.. కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించారు. 41 నిమిషాల నిడివి ఉన్న డాక్యుమెంటరీ. ఇప్పుడు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించింది. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఒక అడవిలో చిన్న గ్రామంలో ఉండే ఓ వయసు మళ్ళిన జంట ఒక అనాథ ఏనుగు పిల్లని పెంచుకుంటుంది. ఆ ఏనుగు పిల్లతో వీరి అనుబంధం, అడవి, ప్రకృతితో అనుబంధం, ఆ ఏనుగు పిల్ల చేసే అల్లరి.. ఇలా ఆ ఏనుగు పిల్ల, ఆ జంట చుట్టూ కథ ఉంటుంది.
ప్రకృతి, జంతువులతో మనుషుల బంధం గురించే ఈ కథ సారాంశం. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా నేడు ఆస్కార్ ని కూడా అందుకుంది. ఈ సినిమాకి కార్తిక్ గోన్సాల్వేస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి కార్తికి మాట్లాడుతూ.. ఇది అద్భుతమైన ఏనుగులు, స్వదేశీ ప్రజల గౌరవాన్ని ఉట్టిపడేలా చేస్తుందని నాకు ముందు నుంచి వచ్చిన వివరణ అని ఆమె పేర్కొన్నారు.
అవార్డును గెలుచుకున్న తరువాత అదే వేదిక మీద ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందం ది ఎలిఫెంట్ విస్పరర్స్ బృందానికి అభినందనలు తెలిపారు.