బతికుండగానే కన్నకూతురికి ఓ తండ్రి పిండం పెట్టిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఆ తండ్రి ఇలా చేశాడు.
చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అనేయువతి.. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడిని ప్రేమించింది.
అయితే ఆమె తండ్రి వారి ప్రేమకు అడ్డు చెప్పాడు. దీంతో.. ఈ నెల 13న వెంకటేశ్, భార్గవి పెద్దలకు చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. కూతురు చేసిన ఆ పనిని జీర్ణించుకోలేక ఆమె తండ్రి గుండు గీయించుకుని దినకర్మ నిర్వహించాడు.
తరువాత భార్గవి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించి నివాళులు అర్పించాడు. గ్రామస్థులు ఆపే ప్రయత్నం చేసినా.. ఆయన వినలేదు. ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశమైంది.