అధికార బలం.. అహంకారం పూనుకొని కొందరు మందుమత్తులో కన్నూ మిన్నూ తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. తాజాగా.. ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ అధికారి నానా హంగామా చేసింది. పోలీసులపై వీరంగం ఆడింది.
అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బహ్రైచ్ లో జరిగింది. దేవిపట్టణం తాలుకాలో డిప్యూటీ లేబర్ కమిషనర్ పని చేస్తున్న రచన కెశర్వానీ అనే అధికారి మద్యం మత్తులో తూగుతూ పోలీసులకు కనిపించారు.
అయితే.. తనను ఎలాగైన ఇంటికి పంపాలని పోలీసులు ప్రయత్నించారు. కానీ.. ఆమె పోలీసులపై విరుచుకుపడింది. ఆమెను కూల్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. ఆమెను కారులో ఎక్కించడానికి ఓ లేడీ కాప్ పడ్డ కష్టాలు వర్ణణాతీతం. అయినప్పటికీ.. ఆ అధికారి తిరిగి కారు దిగారు.
అందుకు సంబంధిని వీడియో వైరల్ కావడంతో కార్మికశాఖ స్పందించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. అధికార దర్పం ప్రదర్శించిన లేడీ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు కామెంట్టు పెడుతున్నారు.