ఒకానొక టైం లో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బాగా ఇబ్బందుల్లో పడింది అనే మాట వాస్తవం. వరుస ఫ్లాప్ సినిమాలతో హిట్ రావడమే కష్టమైంది. ఎంత సీనియర్ డైరెక్టర్ తో చేసినా సరే సరైన హిట్ రాక అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి. ఇక కథల ఎంపికలో కూడా అవగాహన లేకపోవడం ఒకటి అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఆ సమయంలో కథల విషయంలో సహాయం చేసే వాళ్ళు లేకపోవడం మరొకటి.
అలా అశోక్, నరసింహుడు, రాఖీ వంటి సినిమాలు షాక్ లు ఇచ్చాయి. నరసింహుడు సినిమా విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమా షూట్ అంతా అయిపోయినా సినిమా విడుదల కావడమే కష్టంగా మారింది అప్పుడు. బీ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను చెంగల వెంకట్రావు నిర్మించారు. ఆయన కారణంగానే సినిమా విడుదల అప్పుడు బాగా ఆలస్యం అయింది.
సినిమాకు కోటి రూపాయలకు పైగా కట్టాల్సి ఉండటంతో ఆ సొమ్ము జూనియర్ చెల్లించి సినిమాను విడుదల చేయించాడు. కాని సినిమా మాత్రం అనుకున్న విధంగా హిట్ కాలేదు. ఎన్టీఆర్ నటన బాగున్నా కథలో పట్టు లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.