జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బృందావనం సినిమా మంచి హిట్ కొట్టింది. ఆ సినిమా వసూళ్ళ పరంగా కూడా మంచి బూస్ట్ ఇచ్చింది. వంశీ పైడపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన… కాజల్, సమంతా నటించారు. ఇక ప్రకాష్ రాజ్, శ్రీహరి ఈ సినిమాకు ప్రధాన బలం అయ్యారు. ఇక వేణు మాధవ్, బ్రహ్మానందం కామెడి కూడా చాలా బాగుంటుంది. ఆహుతి ప్రసాద్ మంచి కామెడి చేసారు.
ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా బాగుంటాయి అనే చెప్పాలి. అయితే ఈ సినిమా కథ చిరంజీవి హీరోగా వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా కథ ఒకే విధంగా ఉంటుంది. అవును బావగారు బాగున్నారా సినిమా కథ దాదాపు ఇలాగే ఉంటుంది. బావగారు బాగున్నారా సినిమాలో చెల్లిని ప్రేమించి… అక్కకు భర్తగా వస్తాడు హీరో. అక్కడ హీరో అంటే హీరోయిన్ తండ్రికి అసలు ఏ మాత్రం నచ్చదు.
బృందావనం సినిమాలో కూడా దాదాపు అలాగే ఉంటుంది. సమంతాను ముందు ఎన్టీఆర్ లవ్ చేస్తాడు. ఆ తర్వాత కాజల్ కి హెల్ప్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అనే విషయం తెలుస్తుంది. కాజల్ ను కాపాడటానికి ఆమె లవర్ గా వెళ్తాడు. ప్రకాష్ రాజ్ కు అసలు ఎన్టీఆర్ అంటే నచ్చదు. ఇలా ఈ రెండు సినిమాలు ఒకే కథతో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.