దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నగర శివార్లలోని గోకుల్‌పురి ప్రాంతంలోని గుడిసెల్లో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగడంతో కాలనీ అంతా మంటల్లో చిక్కుంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకున్నారు. మొత్తం 13 అగ్నిమాపక యంత్రాలతో నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంలో ఏడు కాలిపోయిన మృతదేహాలను గుర్తించినట్టు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. దాదాపు 60 గుడిసెలకు అంటుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేష్ కుమార్ మహ్లా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలను విచారిస్తున్నాట్టు ఆయన తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.