కాల్వలో స్నానం చేస్తుండగా పూదమూడేళ్ల బాలుడి ముక్కులోకి చేపపిల్ల వెళ్లిన సంఘటన తమిళనాడులోని పదుకొట్టై జిల్లా అన్నవాసల్లో చోటుచేసుకుంది. ఆదివారం సెలవుదినం కావటంతో స్నేహితులతో కలిసి చెరువులో స్నానం చేస్తున్న సమయంలో అరుళ్ అనే అబ్బాయి ముక్కులో చేప దూరింది. వెంటనే అరుళ్ ను హాస్పిటల్ కి తరలించగా, డాక్టర్లు ముక్కులోంచి చేపపిల్ల బయటకు తీశారు. బయటకు తీసిన తరువాత కూడా చేప బ్రతికిఉండటం చూసి అందరు ఆశ్చర్యానికి గురయ్యారు.