నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమాపై మొదట్నుంచి అంచనాలు తక్కువగానే ఉన్నాయి. దీనికితోడు చిరంజీవి సినిమాకు పోటీగా రిలీజ్ చేయడంతో, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పడిపోయాయి. వీటికి అదనంగా సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో.. ఘోస్ట్ జాతకం అయోమయంలో పడింది.
ఇదిలా ఉండగా మొదటి రోజు ఈ సినిమాకు చాలా తక్కువగా ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కేవలం 2 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అంచనా వేసిన నంబర్స్ కంటే ఇది దాదాపు 40 శాతం తక్కువ.
ఏపీ,నైజాంలో ఈ సినిమాను 16 కోట్ల రూపాయలకు అమ్మారు. ఒక్క నైజాంలోనే ఈ సినిమా ఐదున్నర కోట్లకు అమ్ముడుపోయింది. అటు ఆంధ్రాలో 8 కోట్ల రేషియోలో (హయ్యర్స్ తో కలిపి) బిజినెస్ జరిగింది. ఈ డబ్బులన్నీ వెనక్కి రావాలంటే సినిమా కచ్చితంగా 17 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
ఈ టాక్ తో ఘోస్ట్ బ్రేక్ ఈవెన్ కాస్త కష్టమే. అటు చూస్తే గాడ్ ఫాదర్ ఊపందుకుంది. ఉన్నంతలో ఈ సినిమాను ఆదుకునే ఫ్యాక్టర్ ఒక్కటే. సినిమాకు పూర్తిస్థాయిలో నెగెటివ్ టాక్ రాలేదు. ఓసారి చూడొచ్చనే మౌత్ టాక్ బలంగా వినిపిస్తోంది.
ఏపీ,నైజాంలో ది ఘోస్ట్ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి
నైజాం – 57 లక్షలు
సీడెడ్ – 25 లక్షలు
ఉత్తరాంధ్ర – 31 లక్షలు
ఈస్ట్ – 23 లక్షలు
వెస్ట్ – 8 లక్షలు
గుంటూరు – 22 లక్షలు
నెల్లూరు – 15 లక్షలు
కృష్ణా – 19 లక్షలు