నాగార్జున గత చిత్రం బంగార్రాజు మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా విజయంతో నాగ్ నుంచి రాబోతున్న ది ఘోస్ట్ సినిమాపై బెట్టింగ్ జోరుగా సాగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఈ సినిమా అనుకున్న ఎమౌంట్ కంటే 30శాతం ఎక్కువగా బిజినెస్ చేయడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 16 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా, ఓవర్సీస్ లో రెండున్నర కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఓవరాల్ గా హిందీ మార్కెట్, రెస్టాఫ్ ఇండియా వాల్యూతో కలిపి చూసుకుంటే.. ది ఘోస్ట్ సినిమాను అటుఇటుగా 21 కోట్ల రూపాయలకు అమ్మారు నిర్మాతలు. సో.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, ప్రపంచవ్యాప్తంగా కనీసం 22 కోట్ల రూపాయల వసూళ్లు రావాలి.
మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తప్పనిసరిగా హిట్ అవ్వాలి. ఎందుకంటే, నాగార్జున సినిమాల మార్కెట్లు అటుఇటు అన్నట్టు ఉండవు. హిట్టయితే రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది, ఫ్లాప్ అయితే రెవెన్యూ పాతాళానికి పడిపోతుంది. ఈ ట్రెండ్ బట్టి చూసుకుంటే.. ది ఘోస్ట్ సినిమా హిట్టయితే.. ఏపీ-నైజాంలో 16 కోట్లు కలెక్ట్ చేయడం నాగార్జునకు పెద్ద కష్టమేం కాదు. ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం చాలా కష్టం.
నాగార్జున గత సినిమాల ట్రాక్ రికార్డులు చెబుతున్న వాస్తవాలివి. వైల్డ్ డాగ్, మన్మధుడు-2, ఆఫీసర్ సినిమాలు ఈ నిజాల్ని కళ్లకు కట్టాయి. సో.. ది ఘోస్ట్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా హిట్టవ్వాలి. దసరా సీజన్ కాబట్టి, సినిమాకు ఏమాత్రం పాటిజివ్ టాక్ వచ్చినా, గట్టెక్కేయొచ్చు అనేది నాగార్జున ధైర్యం. అందుకే గాడ్ ఫాదర్ లైన్లో ఉన్నప్పటికీ, ఘోస్ట ను థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు.