ప్రస్తుతం నాగ్ చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ది ఘోస్ట్. ఓ సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా చేయడం నాగ్ స్టయిల్. అందుకే ఫోకస్ మొత్తం ఘోస్ట్ పైనే పెట్టాడు. ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి కీలకమైన షెడ్యూల్ పూర్తిచేశాడు నాగ్. దుబాయ్ లో జరిగిన ఈ భారీ షెడ్యూల్ తాజాగా పూర్తయింది.
సినిమాకు అత్యంత కీలకమైన ఓ ఛేజ్ సన్నివేశంతో పాటు ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ను దుబాయ్ లో పూర్తిచేశాడు నాగార్జున. అక్కడితో ఆగిపోలేదు. హీరోయిన్ సోనాల్ తో కొన్ని సన్నివేశాలతో పాటు… ఆమెతో ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా దుబాయ్ లో కంప్లీట్ చేశారు.
ఇలా దుబాయ్ లో సినిమాకు సంబంధించి మేజర్ పోర్షన్ కంప్లీట్ చేశారు. దుబాయ్ ఎడారిలో తీసిన యాక్షన్ సన్నివేశాలు ఘోస్ట్ కు హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నాడు నాగ్.
ది ఘోస్ట్ సినిమాలో ముందుగా కాజల్ ను అనుకున్నారు. ఆమె గర్భవతి కావడంతో సినిమా నుంచి తప్పుకుంది. ఆ స్థానంలో సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారు. మరో హీరోయిన్ గా గుల్ పనాగ్ ను కూడా తీసుకున్నారు. నాగ్ కోసం ప్రవీణ్ సత్తారు ఓ అదిరిపోయే యాక్షన్ కథతో ఈ ఘోస్ట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నాగ్ ఎన్నో యాక్షన్ సినిమాలు చేశారు. కానీ అతడి కెరీర్ లోనే డిఫరెంట్ మూవీగా ఘోస్ట్ నిలిచిపోతుందట.