నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ది ఘోస్ట్. ఈ హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ దుబాయ్ లో తిరిగి ప్రారంభమైంది. ఇది చాలా పెద్ద షెడ్యూల్. సినిమాలోని కీలకమైన నటీనటులంతా పాల్గొనే కీలకమైన షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ లో నాగార్జున సరసన హీరోయిన్ గా ఎంపికైన సోనాల్ చౌహాన్ కూడా యూనిట్ తో జాయిన్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను కూడా టీమ్ ఆవిష్కరించింది.
నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు చేస్తున్న సోనాల్, ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ లో భాగం కావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమాలో నాగార్జున యాక్షన్ మోడ్ లో కనిపించబోతున్నాడు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ల పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సినిమా ప్రీ-లుక్ పోస్టర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగాయి. బంగార్రాజు సక్సెస్ తో ది ఘోస్ట్ కు క్రేజ్ పెరిగింది. మార్కెట్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మేకర్స్ ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయలేదు. త్వరలోనే ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓపెన్ చేసి, ముందుగా నాన్-థియేట్రికల్ రైట్స్ క్లోజ్ చేయాలని భావిస్తున్నారు.