వాస్తవానికి చాలా సందర్భాల్లో అబ్బాయిలు మోకాళ్లపై కూర్చొని అమ్మాయిలకు లవ్ ప్రపోజ్ చేస్తారు. కానీ.. దానికి రివర్స్‌గా జరిగిన ఓ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ అమ్మాయి మోకాళ్లపై కూర్చొని తనకు నచ్చిన అబ్బాయికి లవ్ ప్రపోజ్ చేసింది. అయితే.. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న మైదానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమ్మాయి ప్రపోజ్ చేస్తుండగా ఒక్కసారిగా కెమెరాలు అటువైపునకు తిరిగడంతో ఆ దృష్యాలు కెమెరాకు చిక్కాయి.అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐపీఎల్‌లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్ బెంగుళూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్బీబీ విజయకేతనం ఎగరేసింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగా ఆర్సీబీ అభిమానికి ఓ అమ్మాయి మోకాళ్లపై కూర్చొని తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. ఆ ప్రపోజల్‌ని అంగీకరించి అతడు ఆ అమ్మాయిని కౌగిలించుకున్నాడు.
విచిత్రం ఏంటంటే మైదానంలో వారి ప్రేమకథ సుఖాంతం కాగా.. మరోవైపు చెన్నైపై ఆర్సీబీ విజయం సాధించింది. లైవ్ మ్యాచ్‌లో బాయ్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేస్తున్న అమ్మాయి ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. మ్యాచ్‌కి వ్యాఖ్యానం చేస్తున్న వెటరన్ క్రికెటర్లు కూడా వారి ప్రేమ గురించి మాట్లాడుకోవడం విశేషం.
గతంలో కూడా క్రికెట్ మైదానంలో ఇలాంటి ప్రేమ సన్నివేశాలు చాలా జరిగాయి. క్రికెట్ ఫీల్డ్ నుంచి ప్రారంభమైన ఈ ఆర్సీబీ అభిమానుల ప్రేమకథ చిరకాలం కొనసాగాలని అందరు కోరుకుంటున్నారు. అయితే.. కొహ్లీ అభిమానులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు.