ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగింది. ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్ అందిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా దృష్ట్యా ఉద్యోగులు ఇబ్బందులు పడొద్దని ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ పేర్కొంటున్నాయి. కొత్త జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయని స్పష్టం చేశారు.
పెండింగ్ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త పీఆర్‌సీ ఏప్రిల్ నుండి వర్తించనుంది. ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయస్సు 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. జూన్ 30 లోగా గ్రామ, వార్డు సచివాల ఉద్యోగులందరికీ ప్రొబిషన్ కన్ఫర్మేషన్ చేయనున్నట్టు వెల్లడించింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ ఏప్రిల్ నాటికి క్లియర్ చేయనున్నట్లు తెలిపింది. జూన్ 30 లోగా సీపీఎస్ పై నిర్ణయం తీసుకోనున్నట్టు జగన్ వెల్లడించారు. ఆలోగా కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్, ఎంఐజీ లేఅవుట్లలో 10శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని ఈ ప్లాట్ లలో 20శాతం రిబేట్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
Advertisements
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్ ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో నిర్వహించారు. అందులో ఉద్యోగ సంఘాల నుంచి సీఎం జగన్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఆర్థిక శాఖ అధికారులతో పీఆర్‌సీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లో పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగులకు హామీ ఇచ్చిన సీఎం జగన్… ఆ మేరకు పీఆర్‌సీని ప్రకటించారు.