రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించడానికి ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. రాష్ట్రంలోని పలు సమస్యల పరిష్కారానికి కావలసిన సూచనలను చేశారు సీఎం కేసీఆర్. ఆ సమావేశంలో కేబినెట్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.
వానాకాలం ధాన్యం కొనుగోలు జరుగుతున్న పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తి కావచ్చిందని తెలిపింది. అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా కూడా కొనుగోలు కేంద్రాలకు వస్తున్నాయంది. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉందని తెలిపింది.
దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు పూర్తయ్యేంత వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని ఆదేశించింది కేబినెట్. ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది కేబినెట్. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్.