భూపాలపల్లిలో జర్నలిస్టులు ధర్నాకు దిగారు. తమకు కేటాయించిన భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇంకా స్థానిక నేతల కన్ను తమ భూములపై పడిందని ఆరోపించారు.
పట్టణంలో 50 మంది జర్నలిస్టులకు 2013, 2015 లో అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవ మేరకు 100 గజాల చొప్పున కేటాయిస్తూ.. పట్టాలిచ్చారు. భూపాలపల్లి మండలం లోని పుల్లూరు రామయ్య పల్లి , కొంపెళ్లి రెవెన్యూశాఖ శివారులో ని 141 సర్వే నంబర్ లో రెవెన్యు అధికారులు భూములు కేటాయిస్తూ పట్టాలు అందించారు.
అప్పటి నుండి ఇప్పటి వరకు కనీస వేతనాలు కూడా లేకపోవడంతో 50 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ లు కట్టుకునేందుకు 5లక్షల స్కీం వర్తింపజేయాలని పలుమార్లు నాయకులను ఆడిగినప్పటికి వారిలో చలనం లేదు. అయితే ప్రస్తుతం కలెక్టరేట్ బిల్డింగ్, 200 పడకల ఆసుపత్రి జర్నలిస్టుల ప్లాట్లను ఆనుకుని నిర్మాణం జరగడంతో జర్నలిస్ట్ లకు ఇచ్చిన 100 గజాల భూమి కి డిమాండ్ పెరిగింది.
దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు.. ఎవరికో మనసు పడి మా భూములను గుంజు కునేందుకు కుట్రలు జరుగుతున్నాయని బాధిత జర్నలిస్టులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం రాత్రికి రాత్రే 141 సర్వే నంబర్ లో ని 50 మంది ప్లాట్లను రద్దుచేయలని అనుకుంటున్నట్లు భూపాలపల్లి కలెక్టర్, తహసీల్దార్ పేర్ల తో నోటీసులు జారీ అయ్యాయి.
అయితే ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. జర్నలిస్టులకు కేటాయించిన భూమిని వాళ్లకే వదిలేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ ఇంకా తహశీల్దార్ హామీ ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని పాత్రికేయులు చెబుతున్నారు.