అంబర్ పేట్ లో వీధికుక్కలు నాలుగేళ్ల చిన్నారిని బలి తీసుకున్న ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదొక విషాదకర ఘటన అని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో బాలుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఇప్పటికే ఉన్న ఏర్పాట్లు ఏమాత్రం సరిపోవడం లేదని ఈ ఘటన రుజువు చేసిందని గవర్నర్ పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే పరిష్కారాలు వెతకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆమె. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు.
ఇది ఇలా ఉండగా.. చైతన్యపురి కాలనీలో మరో చిన్నారిపై కుక్కలు ఎటాక్ చేశాయి. అయితే అదృష్టవశాత్తు ఆ చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.