ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు కారణాలు ఏవైనా ఎక్కడో ఒక దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కారు చెట్టుని ఢీ కొట్టడంతో కొత్త పెళ్లి కొడుకు మృతి చెందాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… మహబూబ్ నగర్ జడ్చర్ల మండలం నక్కల బండ తండా వద్ద ఓ కారు చెట్టును కొట్టింది. కారు లో ఉన్న చైతన్య అనే యువకుడు ఈ ప్రమాదం లో మృతి చెందాడు.
గురువారం ఉదయం 11 గంటలకు పెళ్లిజరగాల్సి ఉండగా స్నేహితులను రిసీవ్ చేసుకోడానికి కారులో జడ్చర్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రిస్టియన్ కాలనీ లో నివాసముంటున్నారు చైతన్య.
నారాయణపేట జిల్లా తిరుమలాపూర్ యూపీఎస్ స్కూల్ టీచర్ గా వృత్తి రీత్యా చైతన్య పని చేస్తున్నారు. వరుడు మృతితో పెళ్లింట విషాదం నెలకొంది.