మద్యం మత్తులో ఓ యువకుడు హైదరాబాద్ లో వీరంగం సృష్టించాడు. ఎస్సైని కాలితో తన్ని.. దుర్భాషలాడుతూ నానా హంగామా చేశాడు. తాగి కారు నడపడమే కాకుండా.. బ్రీత్ అనలైజ్ పరీక్షల్లో అడ్డంగా బుక్కయ్యాడు. బూతులతో పోలీసులపైనే విరుచుకుపడ్డాడు.
గౌరవ్ అనే యువకుడు బ్రీత్ అనలైజ్ పరీక్షల్లో తాగినట్లు తేలడంతో ఆ యువకుడిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రెచ్చిపోయిన అతడు ట్రాఫిక్ ఎస్ ఐ ను బూతులు తిడుతూ.. తనకు హైకోర్టు జడ్జి తెలుసని, నీ మీదే కేసు పెడతానని నానా రచ్చ చేశాడు.
బ్రీత్ అనలైజ్ లో 94 పాయింట్లు రాగానే.. కోపంతో ఊగిపోయిన అతడు ‘నేను.. నెలకు 70 వేలు సంపాదిస్తున్నా.. నువ్వు సంపాదిస్తున్నావా.. ‘అంటూ ట్రాఫిక్ ఎస్సై పై మాటలతో విరుచుకుపడ్డాడు. ఐపీసీ సెక్షన్ 123 కింద నీ పై కేసు ఫైల్ చేస్తా.. అంటూ ఎస్సైని కాలితో తన్నాడు..
ఇక ఆ యువకుడి పక్కన ఉన్న యువతి సైతం ఎక్కడా తగ్గలేదు. వీడియోలు తీస్తారా.. మీకు సిగ్గుగా లేదా.. అంటూ రెచ్చిపోయింది. దీంతో.. ఖంగు తిన్న ట్రాఫిక్ పోలీసులు కారుని సీజ్ చేసి, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.