మాములుగా హిట్ దర్శకులు అయినా సరే ఒక్కోసారి ఫ్లాప్ లు కూడా ఎదుర్కొంటారు అనే మాట వాస్తవం. అయితే ఫ్లాప్ దర్శకులకు అవకాశాలు రావడం కాస్త కష్టంగానే ఉంటుంది. కెరీర్ మొదట్లో ఇలాంటి విషయాలు కాస్త రిస్క్ ఫేస్ చేస్తారు దర్శకులు. అయితే ఫ్లాప్ అయినా సరే దర్శకులకు కొందరు హీరోలు మళ్ళీ అవకాశాలు ఇస్తారు. అలా అవకాశాలు ఇచ్చిన హీరోల లిస్టు ఒకసారి చూద్దాం.
ఎన్టీఆర్ – పూరి
ఆంధ్రావాలా సినిమాతో తనకు ఫ్లాప్ ఇచ్చినా టెంపర్ సినిమాతో పూరి జగన్నాథ్ కు అవకాశం ఇవ్వగా అది సూపర్ హిట్ అయింది.
మహేష్ – త్రివిక్రమ్
ఖలేజా సినిమా ఫ్లాప్ అయినా సరే ఇప్పుడు త్రివిక్రమ్ మళ్ళీ మహేష్ తో సినిమా చేస్తున్నాడు.
హరీష్ శంకర్ – రవితేజా
వీరి కాంబోలో వచ్చిన షాక్ సినిమా ఫ్లాప్ కాగా మళ్ళీ మిరపకాయ్ సినిమాతో వీళ్ళు కలిసారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
గోపిచంద్ – సంపత్ నంది
గౌతమ్ నంద ఫ్లాప్ అయినా సరే సంపత్ నందితో గోపీచంద్ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.