హీరోయిన్లకు, హీరోలకు మధ్య చాలా మంచి స్నేహం ఉండేది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అలా స్నేహం ఉంటే ఇద్దరి మధ్య ఏదో ఉందని భార్యతో విడాకులు తీసుకుని ఆ హీరోయిన్ తో హీరో సెట్ అవుతున్నాడు అనే మాట వస్తుంది. ఇక హీరోయిన్లకు ఎవరు అయినా బాగా నచ్చి సన్నిహితంగా మాట్లాడినా ఏదొకటి ఉంటుంది. కాని ఆ రోజుల్లో హీరోయిన్లతో హీరోలు చాలా స్నేహంగా ఉండటమే కాకుండా మంచి విషయాలు చెప్పే వారు.
హీరోయిన్ గా అవకాశాలు రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు ఇచ్చే వారు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెట్ అయిన వారిలో శారద కూడా ఒకరు. ఆమెకు ఎన్టీఆర్ నుంచి మంచి సహకారం ఉండేది. ఆమెకు ఎన్టీఆర్ ఎన్నో ఆర్ధిక సలహాలు ఇవ్వడమే కాకుండా ఆమె నటనను ఎంతగానో అభిమానించారు. ఆమెను రాజకీయాల్లో కూడా ప్రోత్సహించారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు తోడుగా నిలిచారు ఎన్టీఆర్.
ఇక ఆమెను ఎన్టీఆర్ ముద్దుగా శ్రీవారు అని పిలిచే వారు. దానికి కారణం కూడా ఉందని చెప్తారు. ఎన్టీఆర్ ఆమెకు భార్యగా కూడా నటించారు. ఎన్టీఆర్ కు ఆమె భార్యగా చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఇద్దరూ చివరి సారిగా కలిసి నటించారు. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది. శారద ఎంపీగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఎన్నో సలహాలు ఇచ్చేవారట.