కొంతమందికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు అనే మాట వాస్తవం. ఈ క్రమంలో కొందరు ఆకలి చంపుకుంటారు. కొందరు అవమానాలు కూడా పడుతూ ఉంటారు. అలా అవమానాలు పడిన నటి డబ్బింగ్ జానకి. ఆమెకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఇదే ఆమెను అవమానించేలా చేసింది. అసలు ఏంటి మేటర్ అనేది చూద్దాం. స్వయంగా ఆమె ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే… తనకు అప్పులంటే భయమని అన్నారు.
Also Read:ఈసారి వివేకానందపై.. వర్మ వివాదాస్పద ట్వీట్స్!
నాకు ఒక్క పైసా అప్పు లేదని అది దేవుడి దయ అని అన్నారు. ఇతరులకు తన వంతు సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు. తాను వెజిటేరియన్ అని ఆమె పేర్కొన్నారు. నేను ఒక కన్నడ మూవీ షూటింగ్ కోసం వెళ్లానని ఆ సినిమాలో అనంత్ నాగ్ సహా మరి కొందరు నటించారని ఆ సినిమా చాలా పెద్ద సినిమా అన్నారు. మైసూర్ లో ఆ సినిమా షూటింగ్ జరిగిందని ఆ మూవీలో మదర్ క్యారెక్టర్ లో నటించానని అన్నారు.
15 రోజులు షెడ్యూల్ అని ఆ సమయంలో తాను నాన్ వెజ్ ఎక్కువగా తినేదానినని అన్నారు. కన్నడ మేనేజర్ అందరికీ చికెన్ పెట్టి నాకు చికెన్ పెట్టలేదని అలా ఎందుకు చేశావని అడగగా డైరెక్టర్, హీరోయిన్, హీరోకు మినహా ఎవరికీ చికెన్ పెట్టొద్దని ప్రొడ్యూసర్ చెప్పాడని ఆ విషయం తనతో మేనేజర్ చెప్పారని అన్నారు. చికెన్ విషయంలో అలాంటి అవమానాలు జరిగాయని అన్నారు. భోజనానికి అలస్యంగా వెళితే భోజనం ఉండేది కాదని, చికెన్ అలవాటు ఉండటం వల్లే ఇంత బాధ పడ్డానని అనిపించిందని ఇక అప్పటి నుంచి చికెన్ వదులుకున్నట్టుగా ఆమె తెలిపింది.