విక్టరీ వెంకటేష్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో పవిత్ర బంధం ఒకటి. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గరైన ఈ సినిమాలో వెంకటేష్ నటన చాలా బాగుంటుంది. ముందు కాస్త ఆయన పాత్ర నెగటివ్ గా ఉన్నా సరే క్రమంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇక హీరోయిన్ గా నటించిన సౌందర్య అయితే జీవించారు అనే చెప్పాలి. ఆ పాత్రలో ఆమె మినహా ఎవరూ నటించలేరు అనే విధంగా చేసారు.
ఈ సినిమాలో అపురూపమైనదమ్మ ఆడ జన్మ అనే పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ పాటలో సౌందర్యని చూసిన వాళ్ళు… ఇలాంటి భార్య ఉంటే బాగుంటుంది అనుకున్నారట అప్పట్లో. వాస్తవానికి ఈ పాత్ర కోసం ముందు రమ్య కృష్ణ ను తీసుకోవాలని భావించారు. కాని చివరి నిమిషంలో దర్శకుడు సౌందర్య అయితే బాగుంటుందని చీర కట్టు, హావభావాలు అన్నీ ఆమెకు అయితే ఇంకా బాగా సెట్ అవుతాయి అనుకున్నారట.
ఇక నటనకు ప్రాధాన్యత ఉండటంతో సౌందర్య వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమాలో సౌందర్య పాత్రే కీలకంగా ఉంటుంది. ఇలా రమ్యకృష్ణ ను ఈ సినిమా మిస్ అయింది. ఇదిలా ఉండగా వెంకటేష్ ప్రస్తుతం సైంధవ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన చేసిన రానా నాయుడు అనే వెబ్ సీరీస్ ఇప్పుడు విమర్శలకు వేదికగా మారింది.