సినిమా కథ ఎంత బాగున్నా సరే కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాత్రం అనవసరంగా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నటుల ఎంపిక విషయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం ప్రేక్షకులే కాదు ఫాన్స్ కూడా తిట్టే అవకాశం ఉంటుంది. సాహసాలు చేసే సమయాల్లో కూడా అన్నీ చూసుకోవాలి. అలా చూసుకుని ఎన్టీఆర్ సినిమాలో ఒక హీరోయిన్ ను హీరోయిన్ గా తల్లిగా సెలెక్ట్ చేసారు.
ఆ హీరోయిన్ ఎవరో కాదు జమున. దాసరి దర్శకత్వంలో వచ్చిన మనుషులంతా ఒక్కటే సినిమాలో ఈ సాహసం చేసారు. దాసరికి ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని బలమైన కోరికగా ఉండేది. ఎట్టకేలకు 1975 లో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఆ సినిమాలో తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దీనితో ఆ పాత్ర జమున చేస్తే బాగుంటుంది అని ఎన్టీఆర్ చెప్పడంతో దాసరి ఆమెతో మాట్లాడారు.
కాని ఆమె మాత్రం అందుకు నో చెప్పారు. కారణం ఆమె హీరోయిన్ గా మంచి ఫాం లో ఉండటమే. ఎన్టీఆర్ అడిగినా సరే ఆమె నో చెప్పేశారు. దీనితో ఆమె ఒప్పుకోకపోతే ఎన్టీఆర్ డ్రాప్ అవుదాం అనుకున్నారు. కాని దాసరి మాత్రం పట్టు వదలలేదు. జమునతో మాట్లాడి ఆమెను హీరోయిన్ గా, తల్లిగా చేయమని కోరారు. ఆమె ఓకే చెప్పారు, సినిమా పూర్తి అయిపోయింది వేగంగా. 1976 ఏప్రిల్ 7 న భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.