సీఎం జగన్ మీడియాపై ఎలాంటి దృష్టితో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి పేర్లతో సహా విమర్శించటం జగన్ స్టైల్. అయితే… జాతీయ మీడియా విషయంలో మాత్రం జగన్ ఆచితూచి వ్యవహరిస్తుంటారు. హిందూ పత్రిక విషయంలో జగన్ కొంత పాజిటివ్‌గా ఉంటారన్న పేరుంది. అయితే, అమరావతికి మద్దతుగా, వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలకు హిందూ పత్రిక మంచి కవరేజ్ ఇస్తూ వస్తోంది. ఇటీవలే హిందూ పత్రిక ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి కూడా సీఎం జగన్ హజరయ్యారు.
అయితే, హిందూ పత్రిక ఓ పోల్ నిర్వహించింది. ఈ పోల్‌లో జగన్ తీసుకున్న మూడు రాజధానులకు మీరు మద్దతిస్తారా…? వ్యతిరేకిస్తారా…? ఏమీ చెప్పదల్చుకోలేదా…? అంటూ తన పాఠకులను ప్రశ్నించింది. దాదాపు 3.20లక్షల మంది ఈ పోల్‌లో పాల్గొనగా… 83శాతం మంది జగన్ తీసుకున్న మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఓటేశారు. కేవలం 17శాతం మంది మాత్రమే జగన్ తీసుకున్న నిర్ణయం బాగుందని అభిప్రాయపడ్డారు.
అయితే, తాను అభిమానించే హిందూ పత్రికలో వచ్చిన అభిప్రాయాన్ని అయినా సీఎం జగన్ గౌరవిస్తారా…? అన్న మళ్లీ మొదలైంది. కియాపై వచ్చిన వార్తలపై వైసీపీ, జగన్ టీంలు దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో… హిందూ పోల్ ఆసక్తికరంగా మారింది.