2022 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఐపీఎల్ ప్లేయర్ల వేలం ముగిసింది. అందులో సీనియర్ ప్లేయర్లకు మొండి చేయి చూపి.. యువ ఆటగాళ్లపూ దృష్టి సారించాయి ఫ్రాంచైజీలు. అందులో ఎంతో మంది యువ ప్లేయర్లు తమ సత్తా చాటుకునే అవకాశం లభించింది. అందులో మన హైదరాబాద్ కు చెందిన తెలుగు కుర్రాడు ఉండటం గమనార్హం. అయితే.. టీం ఇండియాలో ఆడటమే తన చిరకాల కోరిక అంటున్నాడు యువ క్రికెటర్.
హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ కు చిన్నతనం నుండి క్రికెట్ అంటే ప్రాణం. ఇండియా టీంలో ఆడేందుకు అహర్నిశలు కష్ట పడ్డాడు. చివరకు టీం అంచులకు చేరాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ముంబాయి ఇండియన్స్ అతన్ని కొనుగోలు చేసింది. అయితే.. ఈ వేలంలో ఏదో ఒక జట్టులో స్థానం దక్కింతే చాలనుకున్నాను. కానీ.. అయిదు సార్లు టైటిల్ గెలిచిన ముంబయి టీంలో ఆడే అవకాశం దక్కడం నేను వరంగా భవిస్తానని చెప్తున్నాడు తిలక్.
కనీస ధర రూ.20 లక్షలతో వేలంలోకి వచ్చిన అతణ్ని అంతకంటే 8.5 రెట్లు ఎక్కువ వెచ్చించి ముంబయి సొంతం చేసుకుంది. ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేయడం చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వేలంలో తన పేరు వచ్చిన సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పాడు తిలక్. రోహిత్, బుమ్రా లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లున్న జట్టుతో కలిసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్తున్నాడు. అవకాశం దొరికితే మైదానంలో దిగి సత్తాచాటాలనే పట్టుదలతో ఉన్నానని అంటున్నాడు.
ఈ ఐపీఎల్ లో రాణించి టీమ్ ఇండియా దిశగా సాగడమే తన లక్ష్యం అని చెప్తున్నాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ లో భారత్ తరపున తిలక్ ఆడాడు. గత సీజన్ లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 147.26 స్ట్రైక్ రేట్ తో 215 పరుగులు చేసి ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు. మొత్తంగా ఇప్పటివరకూ 15 టీ20ల్లో 143.77 స్ట్రైక్ రేట్ తో 381 పరుగులు సాధించాడు. హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన తిలక్.. కోచ్ సలామ్ వద్ద శిక్షణ పొందాడు. అయితే.. హైదరాబాద్ రంజీ జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు తిలక్.