సాధారణంగా న్యాయమూర్తులు నిందితులకు తీర్పులు చెబుతూ ఉంటారు. వాళ్లు చేసిన తప్పును బట్టి శిక్షలు వేస్తూ ఉంటారు. అయితే తాజాగా హైకోర్టు ఓ న్యాయమూర్తిని జుడిషియల్ పని నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే…బీహార్ దిగువ కోర్టులో నియమితులైన న్యాయమూర్తిని హైకోర్టు జుడిషియల్ పని నుంచి తొలగించారు. అయితే అంతకన్నా ముందే న్యాయమూర్తి తన ఏకపక్ష వైఖరితో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతే కాకుండా న్యాయం కోసం వచ్చిన నిందితులను హింసిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
అంతే ఆయన ప్రవర్తన గురించి తెలుసుకుని సీరియస్ అయిన హైకోర్టు జస్టిస్ ను ఏకంగా విధుల నుంచి తొలగించింది. హైకోర్టు వర్గాల సమాచారం ప్రకారం శుక్రవారం అంటే సెప్టెంబర్ 24న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మధుబని జిల్లా సబ్ డివిజన్ హనూర్పూర్ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అవినాష్ కుమార్ ను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు తీర్పులు ఇవ్వకూడదు అంటూ హైకోర్టు విధుల నుంచి బహిష్కరించింది.
న్యాయమూర్తి కొన్ని రోజుల క్రితం తన తీర్పులో ఓ వేధింపుల కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ నిందితుడు పశ్చాత్తాపపడానికి ఆ గ్రామంలోని మహిళలలు అందరి బట్టలు ఉతకాలి అని, ఇస్త్రీ చేయాలని షరతు పెట్టాడు. ఆయన ఇప్పటికే ఇతర కేసుల్లో కూడా ఇలాంటి వింత ఉత్తర్వులు జారీ చేశారని కొంతమంది చెబుతున్నారు. ఆయన నిందితుడికి బుద్ధి రావడానికే న్యాయమూర్తి ఇలా చేసినప్పటికీ ఆయన తీర్పు ఆయనకే చిక్కులు తెచ్చిపెట్టింది.