బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, వివాదాలకు మారుపేరుగా నిలిచే హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆమెకు అవసరం లేకపోయినా వివాదాలు ఎక్కడున్నా ఆమె వెతుక్కుంటూ వెళ్లి మరీ వివాదాలను తెచ్చుకుంటుంది.
అలాగే రెండేళ్ల క్రితం బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్‌పై కంగనా చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికీ సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. తనపై అనవసర వ్యాఖ్యలు చేసిందని జావేద్ అక్తర్ కంగనాపై పరువు నష్టం దావా కూడా వేసిన విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ కేసు విచారణ కోసం కంగనా అంధేరిలోని మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు మెట్లెక్కింది.
ఆ సమయంలోనే కంగనా జడ్జికి ఒక పర్సనల్ విన్నపం కూడా చేసింది. తనకు కోర్టులో ప్రైవసీ కావాలని న్యాయమూర్తిని అడగగా.. ఆయన వెంటనే కోర్టులో ఉన్న లాయర్లను, మీడియాను బయటకు పంపేశారు. దీంతో ఈ వార్త కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విషయం విన్నవారికి ఇది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. హీరోయిన్ ప్రైవసీ కావాలని అడిగితే మీడియాను, మిగతా లాయర్లను బయటికి పంపించేయాడమేంటి అని కొందరు నోళ్లు నొక్కుకుంటున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం.. అది న్యాయస్థానంలో ఉన్న ఒక రూల్ అని, సెలబ్రెటీలకు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా విచారం జరిగే సమయంలో ప్రైవసీ కావాలని కోరుకునే వారికి న్యాయస్థానం ఇలాంటి వెసులుబాటును కలిగిస్తోందని చెప్పుకొస్తున్నారు.
ఇక ఈ కేసుపై న్యాయస్థానం తీర్పు త్వరలోనే ఇవ్వనుంది.