వాట్సాప్ విషయంలో వచ్చే వార్తలు అన్నీ ఇన్నీ కాదు. తన వినియోగదారులను ఎక్కడా కూడా నిరాశపరచకుండా కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక వాట్సాప్ సంస్థ… భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. భద్రతను పెంచేందుకు, తమ వినియోగదారుల చాట్ ను రక్షించడానికి నూతన ఆవిష్కరణ ల దిశగా కూడా ఆ సంస్థ అడుగులు వేస్తుంది అనేది అర్ధమవుతుంది. త్వరలోనే మరిన్ని కొత్త ఫీచర్స్ ని భద్రత కోసం ప్రవేశ పెట్టె అవకాశం ఉందనే టాక్ ఉంది.
ఇప్పటి వరకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే సింగిల్ టిక్ వస్తుంది. డెలివర్ అయిన తర్వాత డబుల్ టిక్ వస్తుంది. అవతలి వారు చూస్తే బ్లూ టిక్ లోకి మారిపోతుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు మరో టిక్ ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. బ్లూ టిక్ తో పాటుగా మరో పింక్ టిక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని లేదా మరో బ్లూ టిక్ ఉండే విధంగా ప్లాన్ చేస్తుందని వార్తలు వచ్చాయి. అవతలి వారు మన చాట్ స్క్రీన్ షాట్ తీస్తే మరో టిక్ వచ్చేలా ప్లాన్ చేస్తుందని అన్నారు.
Advertisements
ఇది ఎంత వరకు నిజం అనేది తెలియకపోయినా టెక్ వర్గాలు మాత్రం నిజమే అన్నట్టుగా ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. అయితే దీనిపై వాట్సాప్ బెటా ఇన్ఫో తన ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చింది. స్క్రీన్ షాట్ లను గుర్తించడానికి ఎటువంటి ఫీచర్ ను అభివృద్ధి చేయడం లేదని స్పష్టం చేసింది. ఇక త్వరలోనే స్టోర్స్ ను కూడా మనకు దగ్గరలో ఉండేవి చూపించే విధంగా ప్లాన్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.