యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీనితో పాటు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కె సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే కృతిసనన్ సీతగా నటిస్తోంది.
రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడు పాత్రలో నటిస్తున్నాడు. టి సిరీస్ బ్యానర్ పై 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమాలో కేవలం వంద కోట్ల రూపాయలను విఎఫ్ ఎక్స్ వర్క్స్ కోసం కేటాయించినట్లు ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో ఒక్క సీన్ కోసం 60 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట మేకర్స్. ఐదు నిమిషాల పాటు సాగే ఈ సీన్ సినిమాకి హైలెట్ గా ఉంటుందట. 2022 ఆగస్టు 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.