పెళ్ళీడు దాటిపోయిన చాలా కాలానికి శింబు పెళ్ళికొడుకు కాబోతున్నాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. శ్రీలంకకు చెందిన ఓ బడా బిజినెస్ మ్యాన్ కూతురిని వివాహమాడనున్నట్లు గత కొద్దికాలంగా వార్తలు గుప్పుమన్నాయి.
తాజాగా, శింబు పెళ్లి వార్తలపై ఆయన మేనేజర్ స్పందించారు. ‘‘ శ్రీలంకకు చెందిన తమిళ అమ్మాయిని శింబు పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలన్నింటిని మేము ఖండిస్తున్నాము.
ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. పెళ్లి వంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అంశాలపై వార్తలను రాసేటప్పుడు ఒకసారి మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. అటువంటి శుభవార్త ఏమైనా ఉంటే ముందుగా మీడియాకే తెలియజేస్తాం’’ అని శింబు మేనేజర్ చెప్పుకొచ్చారు.
అప్పట్లో శింబు, నయనతార, హన్సికలతో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. శింబు సినిమాల విషయానికొస్తే మన్మథ, వల్లభ , లైఫ్ ఆఫ్ మత్తు, వంటి చిత్రాలతో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘పాతు తలా’ అనే సినిమాతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ మార్చి 30న విడుదల కానుంది.