అటు ఏపీ ప్రభుత్వంలోనూ ఇటు వైసీపీ పార్టీలోనూ కీలక నాయకురాలిగా ఉన్న రజినీ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. విడదల రజినీ.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఈ డైనమిక్ పొలిటికల్ లీడర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే అవసరమైనప్పుడు ప్రత్యర్థులపై పంచుల వర్షం కురిపిస్తుంటారామె. అటు ఏపీ ప్రభుత్వంలోనూ, ఇటు వైసీపీ పార్టీలోనూ కీలక నాయకురాలిగా ఉన్న రజినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతుంది.
త్వరలోనే సినిమా డైరెక్టర్, హీరో, హీరోయిన్లు ఇతర టెక్నీషియన్లను ఫైనలేజ్ చేసి అధికారికంగా ప్రకటించనున్నారట. అయితే మంత్రి టాలీవుడ్ ఎంట్రీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఇప్పటికే దీనికి సంబంధించి విస్తృతంగా చర్చలు కూడా జరిగాయని టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిర్మాణ రంగంలో తన అభిరుచిని చాటుకునేందుకు రజిని ప్రయత్నాలు ప్రారంభించారని, ఒక బ్యానర్ ను మొదలెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందు కోసం హైదరాబాద్ లో ఇక ఆఫీసుని కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా రజిని ఎంట్రీ కోసం ఒక కథ కూడా సిద్దమైందట.