మనకు విషం అంటే కొన్ని రకాల పురుగుల నుంచి, పాముల నుంచి తేలు వంటి వాటిల్లో ఉంటుంది అనే తెలుసు. అందుకే వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. పాముల్లో కొన్ని రకాలు కనపడితే కచ్చితంగా వాటిని చంపుతాం. అయితే ఆఫ్రికాలో పువ్వులు, పక్షులు, కొన్ని రకాల చెట్లు కూడా విషపూరితం. వీటితో అక్కడి ప్రజలు తెలియక ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు.
Also Read:బంటిగాడు దొరికేశాడోచ్…
చీకటి రాజ్యంగా చెప్పుకునే ఆఫ్రికాలో ప్రాణాంతక పక్షులు కూడా ఉన్నాయి. అందుకే అక్కడి ప్రజలు కొన్ని పక్షులకు కూడా దూరంగా ఉంటారట. పపువా న్యూ గినియా అనే దేశంలో ఒక విషపూరిత పక్షి ప్రాణాలు కూడా తీస్తుంది. హూడెడ్ పితహూయ్ అనే ఒక పక్షి అత్యంత ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ పక్షిలో అత్యంత శక్తివంతమైన హోమోబాట్రో ఖోటాక్సిన్ అనే ఒక రకమైన విషం ఉందని పరిశోధనలో తెలిసింది.
ఈ విషయం అక్కడి స్థానిక వేటగాళ్లకు తెలిసి అది ఉండే పరిసరాలకు కూడా వెళ్ళకుండా జాగ్రత్త పడతారట. అయితే తమకు ప్రమాదం ఉందని గ్రహిస్తే అది కనపడితే చంపి కాల్చేస్తారట. శరీరంలోని ప్రతిభాగంలోను విషమున్న పిటోహుయ్ పిట్ట చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. పక్షి ముద్దుగా అందంగా ఉంది అని ఒక వ్యక్తి… దాని ముక్కుని నోట్లో పెట్టుకున్నాడు. అయితే అది వదిలిన గాలి నోట్లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు.
Also Read:యోగాకు కుల,మత పరిమితులు లేవు: ఉపరాష్ట్రపతి