భూమి మీద అన్ని పాములు మంచివి కాదు. కొన్ని పాములు కాటు వేస్తే ప్రాణం పోవాల్సిందే. కొన్నింటికి వైద్యం చేయించే సమయం ఉంటుంది. మరికొన్నింటికి వైద్యం చేసే సమయం కూడా ఉండదు. ఇక పాముల్లో అత్యంత ప్రమాదకరమైన పాము బ్లాక్ మాంబా. మనుషుల అలికిడి అనిపిస్తే పాములు సహజంగా దూరం జరుగుతాయి గాని ఇది మాత్రం వేటాడుతుంది. దక్షిణ/తూర్పు ఆఫ్రికాలో సవన్నాలలో, రాతి కొండలలో ఉంటుంది ఈ పాము.
పొడవు సగటున 8.5 అడుగుల నుంచి 14 అడుగుల వరకూ ఉంటుంది. తోకని ఆధారం చేసుకుంటే ముప్పావు భాగం శరీరాన్ని గాల్లోనే ఉంచుతుంది. అంటే తోక మీద నిలబడి మనిషి ముఖాన్ని చూస్తుంది. ఈ పాము ఇతర పాముల కంటే వేగంగా వెళ్తుంది. గంటకు 12.5 మైళ్ళ వేగంతో అంటే దాదాపు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీని నోరు బాగా నల్లగా ఉంటుంది. అందుకే దానికి ఆ పేరు వచ్చింది.
మిగతా ప్రాణి మాదిరిగా… కాటేసి వెళ్ళడం దాని నైజం కాదు. చచ్చే వరకు వదలకుండా కాటేస్తుంది. కాటేసిన ప్రతీసారి కూడా ఇతర సర్పాలకంటే న్యూరో కార్డియోటాక్సిన్ ని శరీరంలోకి ఇంజెక్టు చేస్తూ ఉంటుంది. కాటేస్తే కేవలం 20 నిముషాలలోపే ప్రాణం పోతుంది. ప్రతీ సంవత్సరం అధికారికంగా 20,000 మంది ప్రాణాలు తీస్తుంది. రెండు డ్రాప్స్ విషం చాలు మన ప్రాణం పోవడానికి. ఒక్కో కాటులో 400 ఎమ్జీ విషం వస్తే… 10ఎమ్జీ చాలు మన ప్రాణం తీయడానికి. 11 ఏళ్ళు దీని లైఫ్ కూడా.