సినిమా పరిశ్రమలో ఒకసారి అవకాశం రావడం ఎంత కష్టమో… ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. సినిమా పరిశ్రమలో పదుల సంఖ్యలో సినిమాలు చేస్తే బాగానే సంపాదించుకోవచ్చు. కాని అలా సినిమాలు చేసి కూడా ఏమీ సంపాదించుకోలేని నటులు కొందరు ఉన్నారు. వాళ్ళు మన సిని పరిశ్రమలో అత్యంత దురదృష్ట వంతులు అనే చెప్పాలి.
Also Read:అతడు సినిమాలో నటించిన ఈ బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా? హీరో కి మించి…!
చిత్తూరు నాగయ్య: సౌత్ సినిమాలో ఒక వెలుగు వెలిగారు ఆయన. ఒకానొక దశలో భారీ పారితోషికం తీసుకుని హీరోలకు సైతం సవాల్ చేసారు. కాని చివర్లో మాత్రం చిన్న చిన్న పాత్రలు చేసి జీవితం నెట్టుకొచ్చారు.
కస్తూరి శివరావు: మన తెలుగు సినిమాల్లో మొదటి కమెడియన్ ఆయన. సినిమా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి కూడా అవకాశాలు లేక చివర్లో నానా ఇబ్బందులు పడ్డారు. స్టార్ హీరోలు కూడా కుళ్ళుకునే విధంగా ఖరీదైన కార్లలో తిరిగారు.
ఐరన్ లెగ్ శాస్త్రి: మొదట్లో సినిమా కార్యక్రమాలకు పూజలు చేసే వారు ఆయన. అయితే ఆయన్ను అశుభానికి మారుపేరుగా మార్చి ఐరన్ లెగ్ శాస్త్రిగా తెరమీదకు తెచ్చారు ఈవీవీ సత్యనారాయణ. అవకాశాలు ఉన్నంత కాలం ఒకవెలుగు వెలిగి చివర్లో నానా కష్టాలు పడ్డారు.
పొట్టి ప్రసాద్: మంచి టాలెంట్ ఉండి కూడా జీవితంలో ఇబ్బందులు పడ్డారు ఆయన. నాటక రంగం నుంచి వచ్చిన ఆయనకు మంచి సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు.
విశ్వనాథం: జంధ్యాల గారు, ఇవివి గారి సినిమాల్లో కనిపించే ఈయన జీవితం కూడా చివర్లో ఇబ్బందులు పడ్డారు.
Also Read:జీ-23 నేతలకు కాంగ్రెస్ అధినేత్రి పరోక్ష సందేశం