ఈ రోజుల్లో చాలా మందికి తల్లి తండ్రులు భారంగా మారిపోయారనే మాట వాస్తవం. చాలా వరకు తల్లి తండ్రుల కంటే కూడా సంపాదనే లక్ష్యంగా బ్రతుకుతున్నారు అనే మాట వాస్తవం. ఈ క్రమంలోనే ఇద్దరు కొడుకులు ఒక తల్లిని సంపాదన మీద ప్రేమతో పదేళ్ళ నుంచి బంధించారు. తమిళనాడులో జ్ఞానజ్యోతి అనే 72 ఏళ్ళ వృద్దురాలిని పోలీసులు రక్షించారు. గత 10 సంవత్సరాలుగా ఆమెను ఒక ఇంట్లో బంధించి వదిలేసారు.
Also Read:ఆ నగరంలో 71 శాతం భవనాలు ధ్వంసం
చెన్నైలో పనిచేస్తున్న 50 ఏళ్ల పోలీస్ ఇన్‌స్పెక్టర్ షణ్ముగసుందరం, పట్టుకోట్టైలో పనిచేస్తున్న దూరదర్శన్ ఉద్యోగి, అతని తమ్ముడు వెంకటేశన్ (45) అనే ఇద్దరు తల్లిని పట్టించుకోవడం మానేశారు. కుమారులపై తమిళ యూనివర్సిటీ పోలీసులు సెక్షన్ 24 మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ కింద కేసు నమోదు చేశారు. ఇక విలేఖరులతో మాట్లాడుతూ.. తన తల్లికి వచ్చే రూ.30 వేలు ప్రతినెలా తన తమ్ముడు వాడుకుంటున్నాడని, తమ తల్లి అనారోగ్యానికి తమ్ముడే కారణం అంటూ షణ్ముగసుందరం తన తమ్ముడిని తప్పుబట్టాడు.
సాంఘిక సంక్షేమ శాఖ ప్రకారం, 72 ఏళ్ల జ్ఞానజ్యోతి తన ఇంట్లో వివస్త్రగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మహిళను తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చామని, ఆమె త్వరగా కోలుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ పొన్‌రాజ్ ఆలివర్ మీడియాకు వివరించారు. ఆమెకు ఆహారం కావాల్సిన సమయంలో ఇరుగుపొరుగు వారు అందించారని… అయితే పెద్ద కొడుకు పోలీసు కావడంతో వాళ్ళు సమాచారం బయటకు చెప్పడానికి భయపడ్డారని పోలీసులు వివరించారు.
Also Read:ఆయన నిజాలు మాట్లాడరు… మరొకరిని మాట్లాడనివ్వరు