ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా నెల 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధాకృష్ణ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను అద్భుతంగా మలిచిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చేయి చూసి జాతకం చెప్పే వ్యక్తిగా ప్రభాస్ నటన కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. పూజా హెగ్డే ఈ సినిమాలో డాక్టర్ ప్రేరణగా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం సోషల్ మీడియాలో అనేక రకాలుగా జనాలు అభిప్రాయాలు చెప్పారు.
Also Read:చినజీయర్ పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!
సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడానికి కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కారణం అనే ఆరోపణ ఉంది. సినిమాలో పెద్దగా స్టోరీ లేకపోవడం… చిన్న సీన్స్ ని కూడా భారీగా చూపించే ప్రయత్నం చేయడం వంటివి సినిమాకు బాగా మైనస్ అయింది అనే చెప్పాలి. అయితే ఇక్కడ ఫ్యాన్స్ సహా కొందరు ప్రేక్షకుల అభిప్రాయం మరో విధంగా ఉంది. ఇలాంటి కథను ప్రభాస్ చేయడం కరెక్ట్ కాదనే భావన చాలా మందిలో ఉంది.
ఈ కారణంగానే సోషల్ మీడియాలో సినిమా బాగా ట్రోల్ అవుతుంది. చివరిగా ప్రభాస్ ను కూడా విపరీతంగా ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత రెండు సినిమాలు చేస్తే రెండు సినిమాలు ఘోరంగా ఫ్లాప్ కావడం ప్రభాస్ కు పెద్ద మైనస్ అయింది. ఇక సినిమా ఫలితంపై స్పందించిన దర్శకుడు… ప్రేమ కథలో ఫైట్స్ లాంటివి పెడితే వెజ్ హోటల్ లో నాన్ వెజ్ పెట్టినట్టే ఉంటుంది అని ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఇక ప్రభాస్ కూడా ట్రోల్ చేసే వారిపై ఘాటుగానే రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. సినిమా లైన్ మొత్తం ప్రేమ మీద ఆధారపడి చేశారని… కానీ కొందరు కావాలనే సినిమాపై బ్యాడ్ టాక్ సృష్టించారు అని ప్రభాస్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇక దర్శకుడికి కాల్ చేసి అవేమి పట్టించుకోవద్దు అని సినిమాతో తాను హ్యాపీ గా ఉన్నాను అని ప్రభాస్ చెప్పాడట.
Also Read:శివాజీ సినిమాలో అక్కమ్మ, జక్కమ్మ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా…?