అఖండ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ నటించే సినిమాలపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అఖండ సినిమా వంద రోజుల కార్యక్రమాన్ని కూడా చిత్ర యూనిట్ చాలా గ్రాండ్ గా చేసింది. నాలుగు సెంటర్లలో ఈ సినిమా వంద రోజులు ఆడితే… అందులో మూడు సెంటర్ లు కర్నూలులోనే ఉండటం గమనార్హం. ఈ సినిమాలో బాలయ్య నటన అలాగే కొన్ని సన్నివేశాలు చూపించిన విధానం ఫ్యాన్స్ కు చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు.
Also Read:కావాలనే నా సినిమాను టార్గెట్ చేశారు, ప్రభాస్ ఫైర్అయ్యారా…?
అఖండ సినిమా లుక్ పరంగా కూడా బాలయ్యకు మంచి ఇమేజ్ తెచ్చింది. అఘోరా పాత్ర ఆయన కాకుండా ఎవరూ కూడా ఆ విధంగా చేయలేరు అనే రేంజ్ లో బాలయ్య నటన ఉంది అనే మాట వాస్తవం. సినిమా సినిమాకు తగిన విధంగా బాలయ్య తనను తాను మార్చుకుంటూ ఉంటారు. అయితే ఆయన లుక్ కారణంగా సినిమా ఫ్లాప్ అయింది. ఆ విషయాన్ని బాలయ్య సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత స్వయంగా బయట పెట్టారు.
కేవలం బాలకృష్ణ విగ్ కారణంగానే రూలర్ సినిమాలో పాత్ర సరిగా కనపడలేదు అని నిర్మాత కళ్యాణ్ పేర్కొన్నారు. రూలర్ సినిమాలో బాలయ్య ఐటి కంపెనీ హెడ్ గా బాగా నటించిన పోలీస్ అధికారి ధర్మ పాత్ర విగ్ కారణం గా మైనస్ అయిందని పేర్కొన్నారు. 2019 డిసెంబర్ లో వచ్చిన రూలర్ సినిమా డిజాస్టర్ కావడమే కాకుండా పది కోట్ల షేర్ కూడా రాలేదు. ఇప్పుడు బాలకృష్ణ వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. ఈ సినిమాల తర్వాత బాలయ్య ఏ సినిమా చేస్తారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read:ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో మందు పార్టీలు