స్టార్ హీరోలు కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ కథ పడితే అది ఎంపిక చేసుకోకుండా పట్టున్న కథలను ఎంపిక చేసుకుని చేస్తారు. స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత కథ బాగాలేని సినిమాలు చేస్తే మళ్ళీ నిలబడటం కష్టం అవుతుంది. ఇలా కెరీర్ పాడు చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాగే ఒకరు అనుకున్న కథను మరొకరు చేయడం కూడా మనం సినిమా పరిశ్రమలో చూస్తూనే ఉంటాం.
ఇలా సినిమా కథల విషయంలో గొడవలు కూడా అవుతాయి. అల్లూరి సీతారామ రాజు బయోపిక్ విషయంలో కృష్ణకు ఎన్టీఆర్ కు మధ్య గొడవ జరిగింది అంటారు. అలాగే మరో పౌరాణిక చిత్రం విషయంలో కూడా గొడవ అయింది అంటారు. కృష్ణకు చిరంజీవికి మధ్య ఇలాంటి పరిస్థితి వచ్చినా అది గొడవ వరకు వెళ్ళలేదు. 1883 లో హలీవుడ్ లో వచ్చిన ఒక సూపర్ హిట్ అయిన విట్నెస్ అనే థ్రిల్లర్ సినిమా తెలుగులో అనుకున్నారు.
ఈ మేరకు కథలో కూడా చిన్న చిన్న మార్పులు చేసి రెడీ అయ్యారు. దానికి సాక్షి అనే టైటిల్ కూడా ఖరారు చేసారు. చిరంజీవి హీరోగా సినిమా షూటింగ్ వెళ్తుంది. వాస్తవానికి ఈ సినిమాను ముందు కృష్ణ చేయాలి అనుకున్నారు. కాని చిరంజీవి చేస్తున్నారు అని తెలియడంతో వదిలేసారు. ఇక అక్కడి నుంచి చిరంజీవి ఇమేజ్ పెరిగిపోయింది. అప్పుడు కృష్ణకు స్టార్ ఇమేజ్ ఉంది. అయినా చిరంజీవి కోసం ఆ సినిమా వదిలేశారట.