సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సాక్షిగా తనకు అవమానం జరిగిందని వాపోయారు ఎల్లారెడ్డిపేట మండల ఎంపీపీ పిల్లి రేణుక. మండల కేంద్రంలో నిర్వహించిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపీపీని ఆహ్వానించారు కార్య నిర్వాహకులు.
కార్యక్రమానికి హాజరైన తనను సభలో మాట్లాడనివ్వకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడ్డుకున్నారని ఆరోపించారు ఎంపీపీ. కావాలని సభకు పిలిచి అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళా మండల ప్రజాప్రతినిధి పట్ల ఇంత చిన్నచూపు ఏంటని పశ్నించారు.
జిల్లా కలెక్టర్ పక్కన ఉన్నప్పుడే ఇలా అవమానించడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యతో పాటు.. స్థానిక ప్రజా ప్రతినిధిలు, అధికారుల ముందు అవమానపరచడం బాధగా ఉందని అన్నారు.
బీసి మహిళా అనేకారణంతో ఇలా అవమానించారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు ఎంపీపీ రేణుక.