పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదని, దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు ప్రధాని మోడీ. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు మోడీ నివాళులు అర్పించారు.
ఈ ఘటన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అయితే ఈ ఎటాక్ పాక్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్‌లోకి ప్రవేశించి భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉగ్ర శిబిరాలను పేల్చి వేసింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది తీవ్రవాదాలు హతమైనట్లు అమిత్ షా ఓ ఎన్నికల ర్యాలీలో తెలిపారు.