రోజురోజుకు పెరుగుతున్న కరోనాతో ఎప్పుడు ఏ ప్రళయం ముంచుకొస్తుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ వ్యాప్తి దినదినాభివృద్ది చెందుతున్న నేపథ్యంలో.. అధికారులు ఎలా కంట్రోల్ చేయాలనే యోచనలో పడ్డారు. ఉప్పటికే ఉప్పెనలా దూసుకొస్తున్న కరోనాతో వివిధ వేరియంట్ల రూపంలో విజృంభిస్తుంది. ఇప్పటికే డెల్టా వేరియంట్ తో ప్రపంచం అతలాకుతలం అయిందంటే ఇప్పుడు ఒమిక్రాన్ వణికిస్తుంది.
అయితే.. ఒమిక్రాన్ పై కొవాగ్జిన్ బూస్టర్ టీకా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. డెల్టాతో పాటు ఒమిక్రాన్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు బూస్టర్ డోసుతో గణనీయంగా ఉత్పత్తి అవుతున్నాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ పై 100శాతం సామర్థ్యం చూపుతుందంటున్నారు నిపుణులు. ఒమిక్రాన్ పై 90శాతం ప్రభావశీలత చూపించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.
ఒమిక్రాన్ వేరియంట్ పై కొవాగ్జిన్ బూస్టర్ డోసు పనితీరును పరీక్షించేందుకు అమెరికాలోని ఆక్యూజెన్ సహకారంతో అక్కడి ఎమోరీ వ్యాక్సిన్ సెంటర్ లో భారత్ బయోటెక్ పరిశోధన చేపట్టింది. ఇందులో భాగంగా కొవాగ్జిన్ బూస్టర్ తీసుకున్న వారి రక్తాన్ని ఒమిక్రాన్ సోకిన వారి రక్త నమూనాలతో పరిశోధకులు పోల్చి చూశారు. కొవాగ్జిన్ రెండో డోసు తీసుకున్న 6 నెలలు పూర్తైన వారికి బూస్టర్ డోసు ఇచ్చి పరీక్షించారు.90శాతం మందిలో ఒమిక్రాన్‌ను తటస్థీకరించే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు.