కరోనా వివిధ రూపాల్లో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్ తో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ఒకరి ద్వారా ఆరు నుంచి పన్నెండు మందికి సంక్రమించే పరిస్థితి ఉంది. భారత్ లో రానున్న రెండు నుంచి నాలుగు వారాలు చాలా కీలకంగా మారనున్నాయి. రానున్న రోజుల్లో కేసులు అనూహ్యంగా పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు.
రానున్న నాలుగు వారాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగే అవకాశాలున్నాయి. అయితే.. భారత్ మినహా మిగిలిన దేశాల్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ లోని గ్రామీణ ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో లేవు. ఒమిక్రాన్ లో లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. సంక్రమణ మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటోందని చెప్పుకొప్తున్నారు. గ్రామాల్లో కేసులు పెరిగితే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయి. రానున్న ఆరు నెలల్లో కరోనా ఎండమిక్ గా మారే ప్రమాదం ఉందని అమెరికాలోని అంటువ్యాధుల నిపుణుడు, ఎమోరి విశ్వవిద్యాయలం ప్రజారోగ్యం ఆచార్యుడు డాక్టర్ మనోజ్ జైన్ తెలిపారు.
బుధవారం అమెరికా నుంచి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అమెరికాలో ప్రజలు సోషల్ మీడియా భ్రమల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి వ్యాక్సిన్లు తీసుకుంటున్నారని తెలిపారు. అమెరికాలో సోషల్ మీడియానే కొంప ముంచింది. వాటిలో వచ్చే వ్యాక్సిన్లపై వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు పూర్తిగా నమ్మారు. అందుకే వ్యాక్సిన్ వేసుకోవడానిరకి నిరాకరించారు. వ్యాక్సిన్ విషయంలో తప్పుదారి పట్టామన్న సత్యాన్ని గుర్తించి.. వ్యాక్సిన్లు వేసుకునేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రోగనిరోధోక శక్తి తక్కువగా ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత వ్యాధి లక్షణాలు కనిపించినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఐసొలేషన్ ను ఏడు నుంచి పది రోజులు ఉంచితే బాగుండేది. అమెరికాలో కేసులు పెరుగుదల, డాక్టర్లకు కూడా వైరస్ సోకటం, వ్యాధి తీవ్రత లేకపోవటంతో వ్యవధిని అయిదు రోజులకు తగ్గించారు. కనీసం ఏడు రోజులు ఐసొలేషన్ లో ఉండగలిగితే సంక్రమణను నియంత్రించవచ్చు అని ఆయన పేర్కొన్నారు.