యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమాను గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నారట. ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ లేదా అలియా భట్ హీరోయిన్స్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారట.