ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి విరుచుకుపడుతోంది. భారత్ లో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతున్నప్పటికీ.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,528 మందికి వైరస్ సోకింది. అంతేస్పీడ్ గా మరణాల సంఖ్య కూడా పెరిగింది.
కొత్తగా మరో 149 మంది ప్రాణాలు కోల్పోగా.. 3,997 మహమ్మారి నుండి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.40శాతం ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 4,30,04,005 నమోదవగా.. 5,16,281 మంది మరణించారు. మొత్తంగా 4,24,58,543 మంది కరోనా నుండి కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 29,181 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. 24 గంటల్లో 15,77,783 డోసులు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,80,97,94,588 కు పెరిగింది.