చార్ ధామ్ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనున్నట్టు ప్రకటించింది.
తాజా నిర్ణయం ప్రకారం భద్రీనాథ్ ఆలయానికి ప్రతిరోజూ 15వేల మంది భక్తులను అనుమతించనున్నారు. కేదారీనాథ్ ఆలయానికి 12 వేల మంది, గంగోత్రికి 7 వేల మంది, యమునోత్రికి 4వేల మంది భక్తులను అనుమతించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
రాబోయే 45 రోజుల పాటు ఈ ఆదేశాలు వర్తిస్తాయని సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. చాద్ ధామ్ యాత్రకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును తప్పనిసరి చేసినట్టు పేర్కొన్నారు. ఇటీవల కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
చార్ ధామ్ యాత్ర కోసం టూరిజం శాఖ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది.