హైదరాబాద్: గోషామహల్ ప్రాంతంలో ఒక భవనం భూమిలోకి కుంగి పోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. హైదరాబాద్ చకాన్‌వాడిలో ఈ ఘటన జరిగింది. అక్కడి ఒక పురాతన భవనం కొంతమేర భూమిలోకి కుంగిపోయింది. రెండు అంతస్తుల భవనం ఇది. కింది అంతస్తు పూర్తిగా కుంగి పోయింది.