విశాఖలో కామంతో కళ్ళుమూసుకుపోయిన ఓ కామాంధుడిని చితకబాదారు స్థానికులు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ దోమన చిన్నారావుకు కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పుస్తకాలు,పెన్నులు ఎరచూపి అభం శుభం తెలియని మైనర్ బాలికలపై గత కొన్నాళ్లుగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు చిన్నారావు. ట్యూషన్ కి వెళ్లిన బాలికలు అక్కడ ఉండే ఉపాధ్యాయులకు తెలపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ రాజకీయ నాయకుడి అండదండలతో రౌడీ షీటర్ దోమన చిన్నారావు ఇలా చేస్తున్నట్లు బాలికల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ముసుగులో ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు చిన్నారావు. చదువుకునేందుకు సామగ్రి ఇస్తానంటూ చిన్నారులను ఇంటికి తీసుకువెళ్లి చెప్పుకోలేని విధంగా ప్రవర్తిస్తున్నాడు. అయితే స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.