జీవీఎల్ నరసింహారావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ప్రజాగ్రహ సభ ద్వారా నిద్ర లేకుండా చేసి శరణు ప్రభు అంటూ ఢిల్లీ వెళ్లేలా చేసామని వ్వాఖ్యానించారు. దేశంలో హిందువులకు ముప్పు రాబోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
పీఎఫ్ఐ వంటి సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లో పని చేస్తుందని ఆరోపించారు. ఢిల్లీలో పీఎఫ్ఐ మత అల్లర్లు సృష్టించిందని నిప్పులు చెరిగారు. కేరళలో ఓ ప్రొఫెసర్ చేతిని నరికేశారని అన్నారు. పీఎఫ్ఐ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఆగ్రహించారు.
రాష్ట్రంలో పీఎఫ్ఐ సంస్థను నిర్ములించకుంటే పార్లమెంటులో పోరాడుతామమని జగన్ ప్రభుత్వానికి హెచ్చరిలకు జారీ చేశారు. 5 శాతం ముస్లింలు, ఒక శాతం క్రిస్టియన్లు ఉంటే.. ప్రతి వాడాలో మసీదులు, చర్చిలు నిర్మిస్తుందని అన్నారు. నరేగా నిధులతో వాటిని నిర్మించడం సరి కాదన్నారు.
అన్యమత సంస్థల ఆస్తులపై ఉన్న శ్రద్ధ హిందూ ఆస్థులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. లవ్ జిహాద్ చేస్తున్న పీఎఫ్ఐపై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారని నిలదీశారు. మాధరసలను మూసి వేయాలని డిమాండ్ చేశారు.