మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు చేసిన రచ్చకు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చెయ్యాల్సి వచ్చింది. ఈ ఘటన ముంబై లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.
కేరళకు చెందిన ప్రయాణికుడు సర్ఫుద్దీన్ ఉల్వార్ అనే వ్యక్తి దోహా-బెంగళూరు విమానంలో మద్యం తాగాడు. గమనించిన ఎయిర్ హోస్టెస్ నిలదీసింది. దీంతో ఆగ్రహించిన సదరు ప్రయాణికుడు.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. జోక్యం చేసుకున్న తోటి ప్రయాణికులతో ఫైటింగ్ కు దిగాడు.
దీంతో విమానయాన సిబ్బంది ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ విమానాన్ని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ లోని విమానాశ్రయానికి మళ్లించే విధంగా చర్యలు చేపట్టారు. సదరు వ్యక్తిని విమానం నుండి దింపి లియాండింగ్ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు.
అల్వార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విమాన చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఉల్వార్‌ను రిమాండ్ కోసం జైలుకు తరలించారు.