శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఓ నాలుగేళ్ల బాలుడు మిస్సింగ్ కలకలం రేపింది. బాబూ నెహ్రు సెంటర్ లో బిక్కుబిక్కు మంటూ అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు.
బాలుడిని వివరాలు అడగగా భయంతో ఏ వివరాలు చెప్పలేకపోయాడు. పోలీసులు వెంటనే బ్లూ కోల్డ్స్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ రుద్రయ్య బాలుడిని బండి మీద ఎక్కించుకుని పరిసర ప్రాంతాల్లో వాకబు చేస్తుండగా ప్రభుత్వాసుపత్రి సమీపంలో బాలుని తల్లి బాబు తప్పిపోయాడని ఏడుస్తూ కనిపించింది.
వెంటనే కానిస్టేబుల్ బాలున్ని తల్లికి అప్పగించారు. పోలీసులు చూపిన చొరవకు స్థానికులు అభినందిస్తున్నారు.